వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంది : చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu Fire On YCP Govt. ఫేక్ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అర్ధరాత్రి

By Medi Samrat  Published on  12 Feb 2022 12:50 PM GMT
వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంది : చంద్రబాబు నాయుడు

ఫేక్ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అర్ధరాత్రి బెయిలుపై విడుదలయ్యారు. అశోక్‌బాబును సీఐడీ పోలీసులు దాదాపు 18 గంటలపాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అనంతరం విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సుదీర్ఘ విచారణ అనంతరం రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో ఇన్‌చార్జ్ న్యాయమూర్తి సత్యవతి బెయిలు మంజూరు చేయడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.20 గంటలకు అశోక్‌బాబు విడుదలయ్యారు. బెయిలుపై విడుదలైన అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసుతో సంబంధం లేకుండా సీఐడీ పోలీసులు తనను ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల ఉద్యమంపై ఆరా తీసినట్టు చెప్పారు. తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అశోక్ బాబును అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు. అశోక్ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. ఈరోజు టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు. 4 వేల మందిపై కేసులు పెట్టారని, ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇన్చార్జిలను 80 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. 33 మందిని పొట్టనబెట్టుకున్నారని.. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేశారు... ఇలాంటివి మేం చేయించలేకనా? మూడేళ్లకే జగన్ కు అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్ గా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్ గా నియమించారని వివరించారు.




Next Story