చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వేదిక, సమయం ఖరారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

By Medi Samrat  Published on  7 Jun 2024 8:41 PM IST
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వేదిక, సమయం ఖరారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం తాజాగా ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ నేతలు తొలుత మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు. టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు.


Next Story