'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో మేనిఫెస్టోను విడుద‌ల చేసిన చంద్ర‌బాబు

Chandrababu Naidu Announces Tdp Ap Elections Manifesto In Tdp Mahanadu. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

By Medi Samrat
Published on : 28 May 2023 8:59 PM IST

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను విడుద‌ల చేసిన చంద్ర‌బాబు

'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. మహిళల కోసం 'మహాశక్తి' కార్యక్రమం తెస్తామ‌న్న చంద్రబాబు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో వేస్తామ‌న్నారు. 18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధికి అర్హుల‌ని ప్ర‌క‌టించారు. ఆడబిడ్డ నిధి.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామ‌ని పేర్కొన్నారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తామ‌ని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామ‌న్న‌ చంద్రబాబు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణానాన్ని ప్ర‌క‌టించారు. యువగళం విన్నాం కింద‌ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న చంద్ర‌బాబు.. యువగళం నిధి కింద నెలకు రూ.3000 అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రైతుల కోసం 'అన్నదాత' కార్యక్రమం తెస్తామ‌ని.. ఈ ప‌థ‌కం కింద అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామ‌ని పేర్కొన్నారు.


Next Story