ప్రధాని మోదీతో సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం

Chandrababu invited for a meeting with PM Modi to discuss on G-20 nations meetings. జీ 20 దేశాల సమావేశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన దేశంలోని రాజకీయ పార్టీల

By అంజి
Published on : 23 Nov 2022 3:35 PM IST

ప్రధాని మోదీతో సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం

జీ 20 దేశాల సమావేశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు జరిగే జీ-20 సమావేశాలకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. భారతదేశంలో జరగనున్న జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించి, సలహాలు తీసుకోనున్నారు.

సెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. అలాగే సభ ప్రాధాన్యతను ప్రహ్లాద్ జోషి టీడీపీ నేతకు ఫోన్‌లో వివరించి హాజరు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందడంపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఆసక్తి రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి ఆహ్వానం పలికారు. 2014లో ఎన్డీఏలో తెలుగు దేశం పార్టీ ఉంది. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య విబేధాలు రావడంతో 2018లో టీడీపీ బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు.

Next Story