ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి: చంద్రబాబు
''ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి''.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
By అంజి Published on 16 Aug 2023 3:49 AM GMTఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి: చంద్రబాబు
''ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి''.. అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 15వ తేదీన విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా విజన్ 2047 ప్రోగ్రాంని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక విషయాలను ప్రస్తావించారు. చంద్రబాబు తన విజన్ గురించి వివరిస్తున్న సమయంలో.. పిల్లలను ఇంజినీరింగ్ చేయాలనుకోవడం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల అని, ఆ కలే విజన్ అని చంద్రబాబు వివరించారు. ఆ విజన్ నెరవేర్చుకునేందుకు పిల్లలను చిన్నప్పటి నుంచే ఏ స్కూల్‌లో వేయాలి. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి, ఇంటర్మీయట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి - చంద్రబాబు నాయుడు pic.twitter.com/cHt1so9OOC
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2023
అది విన్న వాళ్లందరికీ.. చంద్రబాబు ఏ లాజిక్‌తో చెప్పారంటావ్ చెప్మా.. అంటూ డౌటు బుర్రలను తొలిచేసింది. ఇప్పుడు బైపీసీ.. ఇంజినీరింగ్.. అంటూ చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చెప్పిన ఆయన విలువైన విజన్ మొత్తం పక్కనపెట్టేసి.. ఈ క్లిప్ వరకు కట్ చేసి.. సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇదేం విజనరీ బాబు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు విశాఖ సభలో విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించారు. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ వన్ అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం పలు వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.