'మిస్టర్ జగన్ రెడ్డి.. దమ్ముంటే కుప్పం రండి'.. చంద్రబాబు సవాల్‌

Chandrababu challenged CM Jagan to come to Kuppam if he has guts. ఏపీ సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో

By అంజి  Published on  25 Aug 2022 2:28 PM IST
మిస్టర్ జగన్ రెడ్డి.. దమ్ముంటే కుప్పం రండి.. చంద్రబాబు సవాల్‌

ఏపీ సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, అన్నా క్యాంటీన్‌పై దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లు చించేశారు. అలాగే ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న టీడీపీ బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీలను చింపడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు.

కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని బాబు అన్నారు. కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశారా? అని ప్రశ్నించారు. ఇవాళ తనపైనే దాడికి యత్నించారని చంద్రబాబు ఆరోపించారు. మిస్టర్‌ ఎస్పీ ఎక్కడ ఉన్నావు అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి నిమిషం పట్టదని హెచ్చరించారు. మిస్టర్ జగన్ రెడ్డి... దమ్ముంటే కుప్పానికి రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ''నీ దగ్గర 60 వేల మంది పోలీసులు ఉంటే నా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. జిల్లా ఎస్పీనే ఫ్లెక్సీలను ధ్వంసం చేయించాడు. ధర్మపోరాటం ఇక్కడ్నుంచే ప్రారంభిస్తున్నాను. నేను బ్రతికున్నంత వరకు కుప్పంలో మీరేం చేయలేరు'' అని చంద్రబాబు స్పష్టం చేశారు.



Next Story