'బీసీలను వైసీపీ సర్కార్ అణగదొక్కుతోంది'.. చంద్రబాబు ఆరోపణలు
Chandrababu accused YSRCP govt. of undermining BCs, says their priority reduced. బీసీలను సీఎం వైఎస్ జగన్ అణగదొక్కుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య
By అంజి
బీసీలను సీఎం వైఎస్ జగన్ అణగదొక్కుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సమావేశంలో చంద్రబాబు పాల్గొని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడంతో రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఆర్థికంగా ఎదిగినప్పుడే బీసీలకు మంచి గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు. తాను బీసీలకు ఆదరణ పథకాన్ని అమలు చేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
రూ. 34,400 కోట్లు బీసీ సబ్ ప్లాన్ అమలు చేశారనీ, జనాభాలో 50 శాతం ఉన్న బీసీల కోసం అందరికంటే ఒక్క రూపాయి అయినా జగన్ ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. 140 బీసీ కులాలకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో 37 మంది సభ్యుల్లో బీసీలకు మూడు పదవులు మాత్రమే ఇచ్చారని అన్నారు. తాను ఏ కులానికి వ్యతిరేకిని కాను, సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు.సీఎం, డీజీపీ, సీఎస్, అన్ని శాఖల మంత్రులు, గుమాస్తాలు అందరూ వైఎస్ జగన్ జిల్లాకు చెందినవారని అన్నారు. 2014లో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసిందని, మళ్లీ అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై ఆరోపణలు చేశారని, 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సహకరించకుండా వివేకా కుమార్తెకు వైఎస్ జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ విచారణకు సీఎం జగన్ నిరాకరించారని చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబుపై వైసీపీ ఎదురుదాడి చేసింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తాను ఏం చేస్తున్నావంటూ అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుపై ఎందుకు స్పందించడం లేదని సజ్జల నాయుడుపై మండిపడ్డారు.