తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. జూమ్ ద్వారా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో కరోనా పెరిగిపోతూ ఉన్నా.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని, ఈ రోజు తాను ఆవేదనతో మాట్లాడుతున్నానని అన్నారు. కర్నూలు జిల్లాలో గుర్తించిన ఎన్-440 వేరియంట్ గురించి తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని గుర్తు చేశారు.

ఏపీ కేబినెట్ భేటీలో కరోనా ప్రస్తావన లేకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. టీడీపీ తరపున కొవిడ్ రోగులకు సాయం అందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, కరోనా రోగులకు తమ పార్టీ తరపున సాయం అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. టీకాల విషయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరపాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని, దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.


సామ్రాట్

Next Story