వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By అంజి
వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో డీఎస్సీ నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జూన్‌లో పాఠశాలలు రీ ఓపెన్ అయ్యే సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇటీవల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా పారదర్శకంగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
నోటిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పరీక్షలకు కనీసం 45 రోజుల సమయం ఉండే అవకాశం ఉండనుంది. మొత్తం పోస్టుల్లో ఎస్‌జీటీలు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీలు 1781, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి.