ఆక్వా రైతుల సమస్యలపై ఎంపీ మద్దిల గూరుమూర్తి లేఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మరియు ఐటీ రాష్ట్రమంత్రి జితిన్ ప్రసాద స్పందించారు. అమెరికా విధించిన ప్రతిస్పందన టారిఫ్‌ల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (MPEDA) ద్వారా సీబాస్, కొబియా, పొంపరా, టిలాపియా, క్రాబ్, గ్రూపర్, బ్లాక్ టైగర్ రొయ్యలు వంటి అధిక విలువ కలిగిన జాతులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల విస్తరణతో పాటు, దేశీయ వినియోగాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.