వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
By Medi Samrat Published on 11 Sept 2024 3:07 PM ISTఅధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఇప్పటికే కేంద్ర బృందం పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.. వరద నష్టంపై ప్రాథమిక నివేదిక కూడా రూపొందించారు. వరద పరిస్థితిని, జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో కేంద్ర బృందానికి వివరించారు. దాదాపు రెండున్నర గంటల పాటు రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. అనంతరం క్షేత్ర స్థాయి పర్యటనకు బయలుదేరింది.
సమావేశంలో..
వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసిన తీరును వివరించిన అధికారులు
వరద ప్రభావిత ప్రాంత బాధితులకు కోటికి పైగా ఆహార ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని తెలిపిన అధికారులు
వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామని తెలిపిన అధికారులు
ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సాయం అందించామని వెల్లడి
వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముంపు ప్రాంతాలు, సహాయక చర్యలను కేంద్ర బృందానికి వివరించిన అధికారులు
విజయవాడ పురపాలక పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేంద్ర బృందానికి చూపించిన అధికారులు
ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తున్నామని తెలిపిన అధికారులు
వ్యవసాయం, రైతు సంక్షేమం డైరెక్టర్ డా.ఎ.ఎల్. వాగ్మెర్ నేతృత్వంలో నేడు బాపట్ల, గుంటూరు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్న కేంద్ర బృందం
మధ్యాహ్నం 2.30 గం. ల నుండి 4 గం. ల వరకు పెనమలూరు మండలంలోని యనమలకుదురులో దెబ్బతిన్న ఆర్ డబ్ల్యూఎస్, సీపీ డబ్ల్యూ ఎస్ స్కీం లను కేంద్ర బృందం పరిశీలించనుంది. కంకిపాడు మండలంలోని పెదపులిపాక గ్రామంలో దెబ్బతిన్న గృహాలు, ఉద్యాన పంటల పరిశీలన ఉంటుంది. ఆపై పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటల పరిశీలనతోపాటు తోట్లవల్లూరు మండలం రొయ్యూరు లో దెబ్బతిన్న కంకిపాడు - రొయ్యూరు రహదారి పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా పామర్రు మీదుగా గుడివాడ మండలంలోని నందివాడకు 5 గం. లకు చేరుకుంటుంది. సాయంత్రం 5. 30 గం. ల వరకూ నందివాడలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నీట మునిగిన ప్రాంతాల పరిశీలన ఉంటుంది. సాయంత్రం 5.30 గం. లకు విజయవాడ బయలుదేరుంది.