మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By - Knakam Karthik |
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
అమరావతి : రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమలో నష్టాల్ని పరిశీలించనున్న బృందం పరిశీలించనుంది. మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) పర్యటించనుంది. ఈ మేరకు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు.
వీరు రెండు బృందాలుగా ఏర్పడి తుపాన్ ప్రభావిత జిల్లాల్లో నష్టాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. కాగా సోమవారం టీం-1 బాపట్ల జిల్లాలో, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. మంగళవారం టీం-1 ప్రకాశం జిల్లాలో , టీం-2 కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రం బృందంలో డా.కె.పొన్ను స్వామి, డైరెక్టర్, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్, హైదరాబాద్, మహేష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆప్ ఎక్స్‌పెండిచర్, న్యూఢిల్లీ, శ్రీనివాసు బైరి, డైరెక్టర్, సెంట్రల్ వాటర్ కమిషన్, హైదరాబాద్, శశాంక్ శేఖర్ రాయ్ , ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ, మనోజ్ కుమార్ మీనా, అండర్ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్తి సింగ్ , డిప్యూటీ డైరెక్టర్ , విద్యుత్ శాఖ, న్యూఢిల్లీ, సాయి భగీరథ్, సైంటిస్ట్-E, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ సభ్యులుగా ఉన్నారు.