పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 40.06 లక్షల మంది రాష్ట్ర రైతుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్-జులై 2025 కాలానికి సంబంధించి కేంద్రం నుంచి ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు మస్తాన్‌రావుకు ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రమంత్రి రామనాథ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.
ఆధార్ ధ్రువీకరణ, భూ రికార్డుల లింకింగ్, రియల్ టైమ్ వెరిఫికేషన్‌తో రైతుల అకౌంట్లలో నగదు బదిలీ పారదర్శకంగా చేస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు జమకాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..సగటుగా వారం రోజుల్లోనే ఫిర్యాదులు స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపిస్తోందని పేర్కొన్నారు.