పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల
పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం తొలిదశకు కేంద్రం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2023 6:00 AM GMTపోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల
పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ప్రాజెక్టుకు 2013-14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ ఎల్‌కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించినట్టు లేఖలో స్పష్టీకరించారు.
రూ.10 వేలకోట్ల అడ్‌హక్ నిధులు ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరించాలని సీఎం జగన్ కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తిశాఖకు ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు. సీఎం జగన్ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.