సీఎం జగన్, విజయసాయి రెడ్డిలకు అనుమతి
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు
By Medi Samrat Published on 31 Aug 2023 3:35 PM ISTవిదేశాలకు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. లండన్ లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు అనుమతిని ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తన భార్య భారతితో కలిసి లండన్ కు జగన్ వెళ్లనున్నారు. నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల్లో విజయసాయి పర్యటించనున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్ జగన్ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకూ యూకే టూర్ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా లండన్‌లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్లబోతున్నారు. విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. యూకే పర్యటనకు వెళ్లడం కోసం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. తాజాగా ఆయన విదేశాలకు వెళ్లవచ్చని అనుమతులు ఇచ్చింది కోర్టు.