వివేకా హ‌త్య కేసు.. ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ న్యాయస్థానం

By Medi Samrat  Published on  13 Sept 2023 9:00 PM IST
వివేకా హ‌త్య కేసు.. ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసింది. సెప్టెంబర్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో అనుమతించింది. ఈ మేరకు రాకపోకలకు అయ్యే ఖర్చును కూడా ఉదయ్ కుమార్ రెడ్డి భరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో ఈ నెల 11వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. తన భార్య గర్భవతిగా ఉండటంతో పదిహేను రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 11న తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసింది.

ఉదయ్‌ కుమార్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఈ నెల 11న వాదనలు పూర్తయ్యాయి. తన భార్య గర్భవతిగా ఉందని, 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఉదయ్ కుమార్ రెడ్డి కోరారు. తన భార్యను చూసుకోవడానికి ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు వివరించారు.

Next Story