శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టేసిన సీబీఐ కోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

By Medi Samrat  Published on  19 Sep 2023 2:31 PM GMT
శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టేసిన సీబీఐ కోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న శివ శంకర్‌రెడ్డి తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 24న బెయిల్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఆగస్టు 28న ఉత్తర్వులిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. బెయిల్‌పై మరిన్ని వాదనలు వినాలని కోరుతూ ఆగస్టు 28న శివశంకర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. దీనిపై సెప్టెంబరు 4న విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

ఇక కొద్దిరోజుల కిందట తెలంగాణ హైకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడైన సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. బెయిల్ తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. సునీల్ యాదవ్ హత్య కేసులో రెండో నిందితుడిగా ఉండడంతో పాటు, హత్య కేసులో నేరుగా సంబంధం ఉండడంతో బెయిల్ మంజూరు చేయొద్దని సీబీఐ తరఫున న్యాయవాదులు హైకోర్టును కోరారు. హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సునీల్ యాదవ్ కు బెయిల్ నిరాకరించింది.

Next Story