వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. జనవరి 11 నుంచి 30వ తేదీ వరకు లండన్ కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్నారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు 20 రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. ఇక పాస్ పోర్టు వ్యవహారంలో హైకోర్టులో కూడా జగన్ కు ఊరట లభించింది. జగన్ పాస్ పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్ కు పాస్ పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది. ఎన్వోసీ కోసం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.