24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ

ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్‌ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

By అంజి  Published on  29 Nov 2024 7:58 AM IST
Cash deposit, farmers, Minister Nadendla Manohar, APnews

24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ

అమరావతి: ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్‌ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 40 రోజుల్లో కొనాల్సిన ధాన్యాన్ని 4 రోజుల్లో కొనుగోలు చేసేలా తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు. మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా బకాయి నిధులు రిలీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రి నాదెండ్ల సమీక్ష నిర్వహించారు.

పామర్రు, గుడివాడ ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాముతో కలిసి బొమ్ములూరు గ్రామంలో కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యపు రాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 25 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామన్నారు. మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ ఇబ్బందులు తలెత్తకుండా, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేశామన్నారు. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కనీస మద్దతు ధర అందిస్తోందన్నారు.

Next Story