తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడం.. ఆ వ్యక్తి తిరిగి కొట్టడం. వెంటనే ఆ నేతకు చెందిన అనుచరులు ఆ వ్యక్తిని చితక్కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Medi Samrat  Published on  15 May 2024 12:04 PM IST
తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడం.. ఆ వ్యక్తి తిరిగి కొట్టడం. వెంటనే ఆ నేతకు చెందిన అనుచరులు ఆ వ్యక్తిని చితక్కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్‌ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెనాలి పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటుగా మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐతానగర్ పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే శివకుమార్ తన కుటుంబ సభ్యులు, అనుచరులతో వచ్చారని నేరుగా లోపలికి వెళుతుంటే క్యూ లైన్‌లో రావాలని తాను అడిగినందుకు ఎమ్మెల్యే చెంపపై కొట్టారని సుధాకర్ తెలిపారు. తాను కూడా అందుకే తిరిగి కొట్టానని, ఆ వెంటనే ఎమ్మెల్యే అనుచరులుపై తనపై దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని, తాను ఎవరినీ దూషించలేదన్నారు.

Next Story