పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది.

By Medi Samrat
Published on : 12 July 2025 3:51 PM IST

పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై రప్పా రప్పా అంటూ కామెంట్స్ చేశారు పేర్ని నాని. ఆ వ్యాఖ్యల పైన పేర్ని నాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసు పెట్టారు టీడీపీ నేతలు.

పేర్ని నాని మాట్లాడుతూ మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైర్‌ అయ్యారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలన్నారు. 'రప్పా రప్పా నరికేస్తాం అని అరవడం కాదు. ఇంకా అదే పనా? చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు అసహ్యంగా ఏంటి ఇది? రాత్రికి రాత్రే అంతా జరిగిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు మన ప్రభుత్వం వచ్చాక అన్నీ చేయాలని కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలతో భేటీలో అన్నారు.

Next Story