మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
By - Knakam Karthik |
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులను బెదిరించడంతో పాటు, వారి విధుల్లో అంతరాయం కలిగించారని ఆరోపణలతో బీఎన్‌ఎస్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారు. అదనంగా, అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ ప్రదర్శన కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగిందని పోలీసులు చర్యలు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబటి రాంబాబు, ఇతర నేతలు ముందస్తు అనుమతులు లేకుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, ప్రజలకు అసౌకర్యం కలిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు, విధుల్లో ఉన్న తమను బెదిరించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు పట్టణంలో నిన్న వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులతో అంబటి వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.