సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By - Knakam Karthik |
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 69 అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుండగా, మొoథా తుఫాన్ ప్రభావంపై ప్రధాన చర్చ జరగనుంది.CRDAకి NaFBiD రూ. 7500 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపనుంది. మొత్తంగా CRDA కు 9 వేల కోట్ల రూపాయలు మేర రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపనుంది.
కాగా ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చ జరగనుంది. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025-30 కి ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కీలక ఒప్పందంపై ఆమోదం తెలపనుంది. డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్-టైమ్ గవర్నెన్స్, సుస్థిర ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి కై వ్యవస్థాగత సామర్థ్యాల పెంపునకు సింగపూర్‌తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.
విశాఖలో నవంబర్ 14-15 న జరిగే భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందంపై సంతకం చేసేందుకు మంత్రి లోకేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అనుమతిస్తూ తీర్మానం చేయనున్నారు. అసైన్డ్ భూముల (బదిలీ నిషిద్ధ) చట్టం సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఇళ్లు పూర్తి చేసేందుకు వీలుగా ఎ.పి. టిడ్కోకు వివిధ జిల్లాలలో వందలాది ఎకరాల భూ బదలాయింపునకు ఆమోదం తెలుపనుంది. బందరు మాచవరంలో రవాణా శాఖకు గతంలో కేటాయించిన 1.60 ఎకరాల భూమిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లా శాఖకు కేటాయించేలా ప్రతిపాదనకు ఆమోదం తెలుపనుంది. 33 ఏళ్ల పాటు ఏడాదికి 1,000 రూపాయల చొప్పున లీజ్ ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీకి భూమి కేటాయింపు చేసే ప్రక్రియను కేబినెట్ ఆమోదం తెలపనుంది. కృష్ణ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించనున్నారు. కాగా పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపు ఉత్తర్వుల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.