ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఈ-క్యాబినెట్ సమావేశంలో
By Medi Samrat Published on 23 Oct 2024 8:30 PM ISTబుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఈ-క్యాబినెట్ సమావేశంలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ఘనులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం & విప్తతుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా మీడియాకు వివరించారు..
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి మాట్లాడుతూ..
1.సాదారణ పరిపాలనా విభాగం (GAD):
-G.O. నంబర్లు జనరేట్ చేసేందుకు మరియు G.O.లను అప్లోడ్ చేసేందుకు GOIR (Online Government Orders Issue Register) వెబ్ పోర్టల్‌ని పునరుద్ధరిస్తూ జారీచేసిన GO Ms No.79, GA (Cabinet.II) డిపార్ట్‌మెంట్, Dt. 27.08.2024 ను G.O. జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి తెచ్చే ప్రతిపాదనలకు మరియు GOIR వెబ్ పోర్టల్‌ను నిలుపుల చేసిన తే.15.08.2021 నుండి తే.28.08.2024 దీ మధ్య కాలంలో జారీ చేసిన G.O.లను GOIR వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-గత ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీవో నం.100 జారీ చేసి, టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ అంటూ కేటగిరీలుగా జీఓలను విభజించింది. వాటిలో కూడా కొన్ని జీవోలనే ఏపీ ఈ-గెజిట్ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్ చేసేది. అయితే కోర్టు అన్ని జీవోలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
-అయితే ఈ ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికతను జోడించి పారదర్శకతకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోఐఆర్ పోర్టల్ ను పునరుద్ధరించడంతో ప్రజలందరూ స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు.
2.రెవిన్యూ (ఎండోమెంట్స్):
-AP చారిటబుల్ మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1987 (చట్టం నెం.30 ఆఫ్ 1987) లోని సెక్షన్ 15(1)ని, 15(2) ని మరియు సెక్షన్ 17(5) ని సవరించడం ద్వారా అన్ని ఎండోమెంట్స్ సంస్థల బోర్డు ట్రస్టీలలో మరో ఇద్దరు సభ్యులను పెంచడానికి మరియు మతపరమైన సంస్థల ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణ మరియు నాయీ బ్రాహ్మణ సంఘాల నుండి ఒక్కొకరిని సభ్యునిగా నామినేట్ చేయడానికి AP రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందడులు వేస్తోంది.
-ఆలయ ఆదాయం రూ. 20 కోట్లు కంటే అధికంగా ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటే దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు.
-ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ సామాజిక వ్యక్తిని తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
3.ఇన్ప్రాస్ట్రక్చర్ & ఇన్వెస్టుమెంట్ డిపార్టుమెంట్:
-యాక్టు నెం.34 / 2019 తో రూపొందించబడిన A.P. మౌలిక సదుపాయాలు (జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం - 2019 రద్దుతో పాటు సంబందిత G.O. ప్రకారం జారీ చేయబడిన అన్ని అనుబంధ ఉత్తర్వులు G.O.Ms.No.69 పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం (విమానాశ్రయాలు) విభాగం, తేదీ: 28-08-2019 మరియు G.O.Ms. నెం.76 పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం (విమానాశ్రయాలు) విభాగం, తేదీ: 11-09-2019 రద్దుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-టెండర్ల విధానంలో గత ప్రభుత్వం అవలంభించిన జ్యుడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదు. దానివల్ల టెండర్ల అక్రమాలకు రిటైర్డ్ జడ్జితో ఆమోద ముద్ర వేయించుకోవటమే.
-కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు టెండర్ల విధానంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) గైడ్ లైన్స్‌నే అనుసరిస్తున్నాయి. కాబట్టి, రివర్స్ టెండరింగ్ స్థానంలో కూటమి ప్రభుత్వం కేంద్ర విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్‌నే అనుసరించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను రద్దు చేయడం జరిగింది.
4.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-చెవిటి, మూగ మరియు కుష్టు వ్యాధి బాధిత వ్యక్తుల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1968లోని అధ్యాయం-II లోని సెక్షన్ 6 (బి)ని సవరించి రాష్ట్ర శాసనసభ ముందు బిల్లును ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేసి చూపించారు. ఆర్థిక ఇబ్బందులున్నా వికలాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-ప్రతియేటా వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించి, వారిలో ప్రతిభను గుర్తించేలా చేసింది.
-వికలాంగుల కోసం గతంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలను కూడా గత ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
5.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యూ ఢిల్లీ మరియు భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం కుష్టు, బధిర, మూగ వారి పట్ల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం) ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం, 1956లోని సెక్షన్ 9(2)(a)ని సవరించి బిల్లును రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-వైకల్యం.. ఎంతో మందిని ఏదో ఒక రూపంలో అశక్తులను చేస్తున్న సామాజిక సమస్య. శారీరకంగా లేదా మానసికంగా సాధారణ జీవనం సాగించలేని నిస్సహాయ స్థితి వీరందరిది.
-ఇలాంటివారు సమాజంలో కలవలేకపోవడం లేదా సమాజం ఈ బాధితులను వెలివేయడం వల్ల వారెంతో మనోవేదనకు గురవుతున్నారు. సమగ్ర మానవ అభివృద్ధి ద్వారా సమాజంలో ఉన్నత ప్రమాణాలు ఆవిష్కరించేందుకు ఇలాంటివారికి అండగా నిలవడం ప్రభుత్వాల సామాజిక బాధ్యతగా ఈ సవరణ చేయడం జరిగింది.
6.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-బధిర, మూగ మరియు కుష్టు వ్యాధిగ్రస్తుల వివక్షతను నిర్మూలించేందుకు రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి ప్రతిపాదన ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా, డా.ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యాక్ట్, 1986లోని సెక్షన్ 41(1)(ఎ) మరియు సెక్షన్ 42(2)లను సవరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిననాటి నుంచి దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కీలక కార్యక్రమాలు చేపట్టింది.
-టీడీపీ హయాంలో దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేస్తే.. వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.
7.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-చెవిటి, మూగ మరియు కుష్టు వ్యాధి బాధిత వ్యక్తుల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1968లోని అధ్యాయం-II లోని సెక్షన్ 6 (బి)ని సవరించి రాష్ట్ర శాసనసభ ముందు బిల్లును ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేసి చూపించారు. ఆర్థిక ఇబ్బందులున్నా వికలాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-ప్రతియేటా వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించి, వారిలో ప్రతిభను గుర్తించేలా చేసింది.
-వికలాంగుల కోసం గతంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలను కూడా గత ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
8.రెవిన్యూ (ల్యాండ్స్):
-విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠానికి సర్వే నంబర్లు 102, 102/2 & 103లోని ప్రభుత్వ భూమి 15 ఎకరాలను దారాదత్తం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు G.O.Ms No.343, రెవెన్యూ (అసైన్-ఎల్) డిపార్ట్‌మెంట్, Dt:29.11.2021, G.O.Ms.No.64, రెవెన్యూ (అసైన్-ఎల్) డిపార్ట్‌మెంట్, dt.8.2.2022 & G.O.Ms. No.47 రెవెన్యూ (భూములు-1) డిపార్ట్‌మెంట్, Dt: 6.2.2024 ల రద్దుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-గత ప్రభుత్వంలో శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని ఇచ్చారు. ఈ భూముల వాస్తవ విలువ రూ.225 కోట్లు.. కానీ ఎకరానికి లక్ష చొప్పున రూ.15 లక్షలకు ఇస్తున్నట్లు 2021 నవంబరులో గత ప్రభుత్వం పలు జీఓలను విడుదల చేసింది.
-పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆ భూములను వాడుకోవాలన్నది వారి ఉద్దేశమని పాత జీవోను సవరించాలని తన వారసుడు అయిన స్వాత్మానందేంద్రతో కలిసి గత సీఎంకి లేఖ రాశారు. సముద్ర తీరంలో వాణిజ్య, నివాస ప్రాంతాలకు కూడా భూములు కేటాయించాలని కోరారు. కానీ వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాలకు అని ఆ జీఓలో రాశారు.. దీంతో ప్రభుత్వం ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది.
-టీటీడి లో కూడా భూములు కేటాయించారు. వాటిని కూడా ఈ పీఠం దుర్వినియోగం చేస్తూ వాణిజ్యపంగా ఉపయోగించుకోవడం జరుగుచున్నది.
9.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-విశాఖపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో B.Sc (నర్సింగ్) సీట్లను 25 నుండి 100కి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు G.O.Rt.No.134, HM&FW (E1) Department, Date.23-02-2024 ను ధృవీకరణ (ర్యాటిఫికేషన్) కొరకు చేసిన ప్రతిపాదనలకు మరియు -విశాఖపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో (27) టీచింగ్ పోస్టులు మరియు (56) నాన్ టీచింగ్ పోస్టులు వెరశి మొత్తం (83) నూతన పోస్టులు మంజూరు చేసేందుకు, ఆ పోస్టులను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రమోషన్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-గతంలోనే వైద్యవిద్యలో 1180 సీట్ల నుండి 21 కాలేజీల్లో 2650 సీట్లు అందుబాటులో ఉండేలా చేసి విద్యార్థులకు విద్యావకాశాలు పెంచారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1999లో అనంతపురంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే పీజీ సీట్లను కూడా 696 నుండి 1170 సీట్లకు పెంచారు. విజన్ 2020 స్పూర్తితో ఉన్నత విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచారు.
-ఇప్పుడు కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. వైద్యవిద్యపై కూడా ఫోకస్ పెట్టి ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు మారాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం.
10.ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
-డెరైక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న మంగళగిరి 100 పడకల ఏరియా ఆసుపత్రిని అప్-గ్రేడేషన్ చేయడానికి అవసరమై అంచనా మొత్తం రూ.52,20,88,252/- ( నాన్ రికరింగ్ ఎక్సెపెండిచర్ రూ. 47.50 కోట్లు మరియు రికరింగ్ ఎక్సెపెండిచర్ రూ.4,70,88,252/-) లతో పాటు (73) అదనపు పోస్టుల మంజూరీకై చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి ఆమోదం తెలిపింది.
-మంగళగిరిలో AIIMS మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరెన్నో ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు వచ్చాయంటే అది చంద్రబాబు కృషి ఫలితమే.
-టీటీడీ ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్థాపించడం జరిగింది.
-ఉద్దానం సమస్యకు ఊరట కలిగిస్తూ 62 డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పి కిడ్నీ రోగులకు ప్రతి నెలా ఫించన్లను అందజేయడం ప్రారంభించారు.
-ప్రతి నియోజక వర్గంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
11.వ్యవసాయ & సహకార శాఖ:
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ ఆద్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను రాష్ట్రంలో వరి సేకరణ కోసం A.P. మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల మేర తాజా రుణం పొందేందుకై ప్రభుత్వ హామీని జారీ చేసేందుకు మరియు NCDC (National Cooperative Development Corporation) ప్రత్యక్ష నిధుల కింద వర్కింగ్ క్యాపిటల్ సహాయం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమీషన్ మాఫీకి అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-రైతన్న సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయానికి పెద్దపీట వేస్తోంది మన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం రైతన్నలకు పెట్టిన ధాన్యం బకాయిలను రూ.1,674 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయాని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో రూ.1.66 క్షల కోట్లు పంట రుణాలే..
12.వ్యవసాయ & సహకార శాఖ:
-ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSSDCL) A.P. స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, విజయవాడ నుండి ఇప్పటికే పొందిన రూ. 80 కోట్ల బ్యాంక్ ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుండి మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తాము, ఆరోజే సిలిండర్లను డెలివరీ చేస్తాం. ఇందుకై మూడు రోజుల ముందు నుండే సిలిండర్ల బుకింగ్ ప్రక్రియను ప్రారంబించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
- ఈ పథకం అమలుకై ప్రతి ఏటా రూ.2,684 కోట్ల మేర ఖర్చు అవుతుంది.
- ఇందుకై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
- ప్రతి గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 లని, ఈ మొత్తం సొమ్ము రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందజేయడం జరుగుతుంది. ఈ రాయితీ సొమ్మును డిబిబి ద్వారా లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తాం.
- డెలివరీ అయిన 48 గంటల్లోపే డి.బి.టి. ద్వారా లబ్దిదారుల ఖాతాకు జమ అయ్యే విధంగా చర్యలు
- మూడు బ్లాక్ పిరియడ్లలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది, ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు మరియు డిశంబరు నుండి మార్చి మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తాం.
- ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నాం
- ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ పథకం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి తక్షణ పరిష్కారానికి గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టమ్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నాం.
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చిందా అనే విధంగా మూడు సిలిండర్లు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టాం. మేం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలోపెట్టుకునే చేశాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం పై హామీ ఇచ్చాం. ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించి పేద ప్రజల ఇళ్లల్లో దీపావళికి వెలుగులు నింపబోతున్నాం. అక్టోబర్ 31 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ప్రతి మహిళా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. వంటింటిపై భారం తగ్గించడంలో ఇదోపెద్ద ముందడుగు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన లబ్దిదారులకు 24 గంటల వ్యవధిలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉంది. ఏడాదికి ఉచితంగా మూడు అంటే రూ.2684 మేర మీకు లబ్ది జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. వంట గ్యాస్ కోసం పెట్టే ఖర్చును మహిళలు ఇక తమ అవసరాలకు వాడుకోవచ్చు. ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగం అవుతాయి. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల వరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. నేడు మూడు పార్టీల కూటమి లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు గత పాలకులు ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేశారు. నదీ గర్భాన్ని చీల్చి ఇసుకను దిగమింగారు. అంతటితో ఆగకుండా ఇసుక ధరలు పెంచి ప్రజలు, నిర్మాణ దారులపై భారం మోపారు. అయితే ప్రజలకు ఇసుక కొనుగోలు భారం కాకూడదని, నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను కేవలం సీనరేజ్, లోడిండ్ ఛార్జీలు మాత్రమే తీసుకుని ప్రజలకు భారం లేకుండా సరఫరా చేశాం. జూన్ నుండి వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుండి కూడా కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో ఇసుక తీయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలా రకరకాల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పుడున్న రీచ్ లతో పాటు రాష్ట్రంలో మరో 108 కొత్త రీచ్ లకు అనుమతి ఇచ్చాం. తద్వారా ఇసుక సరఫరా పెంచడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇసుక లభ్యతను మెరుగుపరచడానికి, అక్రమ రవాణాను నిరోధించి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉచిత ఇసుక విధానంలో మరికొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు 30 లక్షల మంది భవన నిర్మాణా కార్మికులకు ప్రయోజనం కలిగించడంతో పాటు నిర్మాణ రంగానికి ఎంతో ఉపకరిస్తుంది. సీనరేజ్, DMF, MERIT ఫీజులకు మినహాయింపునిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మూడింటికి కలిపి టన్నుకు రూ.వంద వరకు చెల్లిస్తున్నారు. ఇకపై ఆ డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నదీ తీర గ్రామాల్లోని ప్రజలు నేరుగా సచివాలయాల్లో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని ఉచితంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తున్నాం. వారి అవసరాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కనుక తీసుకెళ్తే మాత్రం అడ్డుకట్ట వేస్తాం. అక్రమ తవ్వకాలకు పాల్పడినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పినిసరిగా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాలనే విధానం గతంలో ఉండేది. దాన్ని కూడా కొందరు బ్లాక్ మార్కెటింగ్ కు ఉపయోగిస్తున్నారన్న సమాచారం ఉంది. దీనికి కూడా చెక్ పెట్టేలా పాదర్శక విధానంతో ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. వినియోగదారులు నేరుగా ఇసుక సరఫరా కేంద్రాలకు వచ్చి మీ సొంత వాహనం లేదా, మీరు బుక్ చేసుకున్న వాహనాల్లో మీకు కేటాయించిన సమయంలో ఇసుకను తీసుకొని వెళ్లొచ్చు. ఇసుక సరఫరా కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంపిక చేసిన ఏజెన్సీలతో తవ్వకం, లోడింగ్ కోసం ప్రజల సహాయాన్ని ఎంచుకుని, ఇన్వాయిస్ జారీ చేయడంపై కార్యాచరణ ఖర్చులకు ఖర్చు పరిమితం చేయబడుతుంది. ఇసుకును తీసుకెళ్లే అన్ని వాహనాలు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయబడతాయి. ఏవైనా ప్రమాదాలు జరిగినా గుర్తించడంతో పాటు అక్రమాలకు పాల్పడితే ఆ వెహికల్ ను బ్లాక్స్ట్ లో పెట్టడం సీజ్ చేయడం, క్రిమినల్ కేసుల పెట్టడం లాంటివి చేయడబతాయి. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపైనా పీడీ యాక్ట్ ఉపయోగిస్తాం. విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాలు వంటి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేయడానికి వనరులు లేవు. ఈ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా స్టాక్ యార్డుల ద్వారా ఇసుక సరఫరా జరిగేలా చేస్తాం. ఈ స్టాక్ యార్డుల ద్వారా వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇసుకను అందిస్తాయి. ఈ కార్యకలాపాలను జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) పర్యవేక్షిస్తుంది. ఈ DLSC ద్వారా పారదర్శక ప్రక్రియతో పాటు మినరల్ డీలర్ లైసెన్స్ల ద్వారా స్టాక్ యార్డ్లు నిర్వహించబడతాయి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు పటిష్టం చేస్తాం. అక్రమ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి, నిరోధించడానికి, ఇసుక సరిహద్దులను దాటకుండా చూసేలా ఉంచేందుకు ఆయా ప్రధాన మార్గాల్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తాం. కాల్ సెంటర్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా చట్టవిరుద్ధమైన ఇసుక తవ్వకాలు లేదా రవాణాపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలను ప్రారంభిస్తాం.