మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసిందని, బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేశారన్నారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? అని బుగ్గన ప్రశ్నించారు.
గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు. గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు 21వేల కోట్ల రూపాయలు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే అని అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేసినా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు.