కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం : బుద్దా వెంకన్న

కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దమ‌ని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  12 Jan 2024 3:48 PM IST
కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం : బుద్దా వెంకన్న

కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దమ‌ని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..? తిరిగి చెల్లించింది ఎంత..? తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అని ప్ర‌శ్నించారు. కేశినేని నాని కబ్జాలు చేశారని.. ఆయ‌న‌కు భయం మొదలైందని అన్నారు.

తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టే.. గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని నాని చెప్పాడని.. టీడీపీలో ఉండగా ఇంఛార్జీలను పక్కన పెట్టుకునే వాడు కాదని.. కానీ ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్ ను పక్కన పెట్టుకున్నారని.. అవినాష్ పక్కన లేకుంటే తంతారని కేశినేని నానికి భయం పట్టుకుందన్నారు.

సూర్యకాంతం పేరు ఆడపిల్లలకు పెట్టడానికి భయపడతారు.. నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్లి వీరంగం వేస్తే ముడ్డి మీద కొడతారని హెచ్చ‌రించారు.కేశినేని నాని ఓ ఛీటర్, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారని.. గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి.. వాళ్ల పార్టీలో చేరుతానన్నారు. వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారని.. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న కేశినేని నానికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చిందన్నారు.

వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టిక్కెట్ ఇచ్చారని విమ‌ర్శించారు. కేశినేని నాని శాడిస్టు ముదిరి సైకోలా మారారని.. కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు-లోకేష్‌లను అబ్బా కొడుకులంటావా..? కేశినేని నానిని.. ఆయన కూతురును కానీ మేం అనగలం.. కానీ సంస్కారం అడ్డొస్తుందన్నారు. కేశినేని నాని ఓ బచ్చా.. కౌన్ కిస్కా గొట్టం అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు.. నువ్వు చేశావా..? నువ్వెంత.. ? నీ బతుకెంత..? ఫైర్ అయ్యారు. జగన్ను చెల్లి ఛీ కొట్టింది.. నానిని చిన్ని ఛీ కొట్టాడ‌ని వ్యాఖ్యానించారు.

కండువా కప్పుకోకుండానే కేశినేని నానికి సీటిచ్చారంటేనే ఆ పార్టీ పరిస్థితేంటో అర్థం అవుతోందన్నారు. నిన్నటి వరకూ కేశినేని నాని వెంట ఉన్నారు.. నాని పార్టీ మారితే తిరస్కరించారు. కేశినేని నానిని తిరస్కరించిన కార్యకర్తలకు సెల్యూట్. జగన్ దగ్గరకు వెళ్లినప్పటి నుంచే కేశినేని నానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

Next Story