భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

By Medi Samrat  Published on  1 Dec 2024 1:45 PM GMT
భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. గత ప్రభుత్వం అండతో రామ్ గోపాల్ వర్మ నోటికొచ్చినట్టు వాగాడని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రల్ లేకుండా దాక్కున్నాడని విమర్శించారు. గతంలో చంద్రబాబును అవమానపరిచేలా చెత్త సినిమాలను జగనే తీయించాడని, అందువల్లే వర్మను కాపాడేందుకు జగన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే సామాజిక మాధ్యమాల్లో నీచమైన పోస్టులు పెడుతున్నారని, వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినవేనని బుద్దా ఆరోపించారు.

తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోని తన ఆర్జీవీ డెన్ లోనే ఉన్నానని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. నోటీసులపై తాను ఇచ్చిన రిప్లయ్‌పై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానని, అరెస్ట్‌ చేస్తారనే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశానని తెలిపారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానని, నా ట్వీట్ల వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వర్మ చెబుతున్నారు.

Next Story