వ‌రుడికి షాకిచ్చిన వ‌ధువు.. ఆ మాట ముందే చెబితే బాగుండేదిగా..!

Bride loves Another person. పెళ్లి మండ‌పంలో సంద‌డి మొద‌లైంది. ఇటు వ‌రుడు.. అటు వ‌ధువు ఇద్ద‌రూ రెడీ అవుతున్నారు.

By Medi Samrat  Published on  21 Nov 2020 1:59 PM GMT
వ‌రుడికి షాకిచ్చిన వ‌ధువు.. ఆ మాట ముందే చెబితే బాగుండేదిగా..!

పెళ్లి మండ‌పంలో సంద‌డి మొద‌లైంది. ఇటు వ‌రుడు.. అటు వ‌ధువు ఇద్ద‌రూ రెడీ అవుతున్నారు. మ‌రో గంట‌లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌నున్నారు. అయితే.. పెళ్లి కూతురు అంద‌రికీ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. నాకీ పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెద్దవాళ్లకు ఏం చేయాలో తెలీలేదు. ఆమెకు న‌చ్చ‌జెప్పేందుకు పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తూనే ఉండ‌గా.. ప్రియుడిని కూడా రంగంలోకి దింపింది. ఈ ఘ‌ట‌న‌తో పెళ్లికొడుకు షాక్‌కు గురైయ్యాడు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా పీలేరు నిమోజ‌క‌వ‌ర్గం గుర్రంకొండ‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. కడపకు చెందిన భావన చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తన ఆఫీసులోనే పనిచేస్తున్న చెన్నైకి చెందిన ఆకాష్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఇద్ద‌రూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యాన్నిత‌ల్లిదండ్రుల‌కు చెబితే.. వారు ఏమంటారో అని భ‌య‌ప‌డింది. వారికి త‌న ప్రేమ విష‌యం చెప్ప‌లేదు. పెద్ద‌లు గుర్రంకొండ‌కు చెందిన ఓ వ్య‌క్తితో వివాహాం కుదిర్చారు. పెద్ద‌లు చూపించిన సంబంధానికి ఓకే చెప్పింది. దీంతో అంగ‌రంభవైభ‌వంగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందు రోజు రాత్రి వైభవంగా రిసెప్షన్‌ కూడా పెట్టారు. 8 వందల మంది దాకా బంధు మిత్రులంతా కల్యాణ మండపానికి వచ్చారు.

అర్థరాత్రి రెండు గంట‌ల‌కు మండ‌పానికి పోలీసులు ఎంట్రీతో అక్క‌డి సీన్ మారిపోయింది. భావన ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమాచారం అందడంతో స్థానిక హెడ్‌ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులను వెంటేసుకుని కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషయం చెప్పారు. వధువును ప్రశ్నించడంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

ఉదయం 8 గంటల వరకు అమ్మాయికి కౌన్సిలింగ్ నిర్వ‌హించినా.. పెళ్లి చేసుకొనేందుకు ఆమె ఒప్పుకోలేదు. ప్రియుడితోనే జీవితాన్ని పంచుకుంటాన‌ని కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. అప్ప‌టికి గానీ అక్క‌డ ఏం జ‌రుగుతుందో పెళ్లి కొడుక్కి అర్థం కాలేదు. ఇదేం ఖర్మరా నాయనా అంటూ పెళ్లికొడుకు నెత్తీ నోరూ బాదుకున్నాడు. ముందే చెప్పొచ్చు కదా.. ఆఖరి నిమిషంలో ఈ ట్విస్ట్‌ ఏంటని తిట్టుకున్నాడు. బంధువులందరిలో పరువు తీసిందని గగ్గోలు పెడుతున్నాడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఎమ్మార్వో వచ్చి అమ్మాయి వాంగ్మూలం తీసుకుని పేరెంట్స్‌కు అప్పగించారు. ఈ నాట‌కీయ ప‌రిణాల మ‌ధ్య ఆమె ప్రియుడు అక్క‌డికి చేరుకున్నాడు. పెళ్లి కుమారుడిని, ఆమె ప్రియుడిని, త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు క‌డ‌ప‌కు పంపారు.
Next Story
Share it