ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన‌ బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు

By Medi Samrat  Published on  21 Aug 2024 4:37 PM IST
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన‌ బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. చైర్మన్ ఛాంబర్‌లో ఈ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం విజయరాజు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మానికి వైసీసీ కీల‌క నేత వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వ‌రరావు, కురసాల కన్నబాబు, ప‌లువురు పార్టీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

Next Story