టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా.? : బొత్స సత్యనారాయణ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దన్నానపేటలో వెంకునాయుడు అనే వ్యక్తి ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు

By Medi Samrat  Published on  27 July 2024 9:27 PM IST
టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా.? : బొత్స సత్యనారాయణ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దన్నానపేటలో వెంకునాయుడు అనే వ్యక్తి ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోందని.. మారుమూల గ్రామానికి వెళ్లి విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారన్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం కరెక్ట్ కాదన్నారు. టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాపత్రినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది.. రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌పై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులు ఇలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహించొద్దని ప్రభుత్వానికి బొత్స సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతీకార దాడులు, రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు.

Next Story