గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తిని..
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Sept 2023 8:40 PM ISTగన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో బాంబ్ ఉందని అజ్ఞాత వ్యక్తి కాల్ చేసాడు. దీనితో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులుపెట్టారు. చివరకు అది పేక్ కాల్ గా నిర్దారణ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల పిర్యాదు మేరకు కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో సీఐ కనకారావు, ఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టి కేసును చాకచక్యంగా 24 గంటలలోపే చేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్‌పోర్ట్‌కు పేక్ కాల్ చేసిన వ్యక్తి వెస్ట్ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ముప్పాళ్ల రంగరామన్ గా గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రంగరామన్ ప్రవర్తన (మెంటల్ కండిషన్) అనుమానస్పదంగా ఉండటంతో బుధవారం విజయవాడ మానసిక హాస్పిటల్ లో చెకప్ చేయించగా.. డాక్టర్ నిందితుడి మెంటల్ కండిషన్ బాలేదని దృవీకరించడం జరిగింది. దీంతో నిందితుడిని బుధవారం మధ్యాన్నం గన్నవరం కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రంగ రామన్ ను తక్షణమే వైజాగ్ మెంటల్ ఆసుపత్రికి తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో రంగ రామన్ ను వైజాగ్ తరలించడం జరిగింది. అయితే రంగ రామన్ పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. మానసిక పరిస్థితి బాగోక ఇలాంటి పనులు చేస్తున్నట్టు తెలుస్తుంది.