ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి యూనివర్సిటీ అధికారిక మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు సందేశం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే త్రీటౌన్ పోలీసులు, బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. ప్రధానంగా ఉమెన్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.