హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక

రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నామని, కానీ ఆయన కామెంట్లపై హిందువులు రగిలిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ.

By -  Medi Samrat
Published on : 20 Nov 2025 6:25 PM IST

హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక

రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నామని, కానీ ఆయన కామెంట్లపై హిందువులు రగిలిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. ఏదో ఒక విధంగా రామ, కృష్ణ అనడం వల్లనే రాజమౌళికి ఆ స్ధాయి వచ్చిందని తెలిపారు. ఆంజనేయుడిపై నమ్మకం లేదనడం హిందువుల మనోభవాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. అంత పేరు, అంత డబ్బు, ప్రతిష్ట హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని తెచ్చుకుంటారని విమర్శించారు. చట్ట ప్రకారంగా ఏమైనా చేసుకోవచ్చు‌. సంబంధం లేకుండా హిందూ దేవుళ్లను అంటే ఊరుకోమని హెచ్చరించారు.

దర్శకుడిగా రాజమౌళికి పేరు రావడానికి ఆ దేవుడే కారణమని, వ్యక్తిగత అంశాలతో హిందూ దేవుళ్లపై కామెంట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు యామిని శర్మ. సినీ ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో మాట్లాడితే ఏం జరిగిందో అందరికీ తెలుసని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, స్పృహలో ఉండి మాట్లాడాలని హెచ్చరించారు. సనాతన ధర్మానికి నిరూపణలు అవసరం లేదు, పబ్లిసిటీ కోసం వినియోగించుకోవడానికి దేవుడు కమర్షియల్ కాదని యామిని శర్మ తెలిపారు.

Next Story