పొత్తుల గురించి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

BJP leader Adinarayana Reddy's sensational comments about alliances. ఏపీలో పొత్తుల గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  30 April 2023 9:15 PM IST
పొత్తుల గురించి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పొత్తుల గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ సోలోగానే సిద్ధమని అంటోంది. టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాత్రం టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి పనిచేయనున్నాయని అన్నారు. అందులో భాగంగానే తాజా భేటీలు జరిగాయని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి సంఘటనలో వాస్తవాలు బయటికి రావడంతో ఎవరు నిందితులో అందరికీ తెలిసిందన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి…. వైయస్ అనే బ్రాండ్ ను పూర్తిగా చెడగొట్టారని అన్నారు.


Next Story