Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
(బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. `
By Knakam Karthik
Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
అమరావతి: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. `ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్' క్యాంపస్ 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ (ఏఐ ప్లస్) క్యాంపస్‌లో రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్థులు అభ్యసించేలా తీర్చిదిద్దనున్నారు. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, ఏఐలో మాస్టర్స్ ప్రోగ్రాం, మెషీన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ వంటి కోర్సులను ప్రవేశపెడతారు.
అలాగే, ఇనిస్టిట్యూట్ తన సొంత ఎడ్యుకేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ బిట్స్ పిలానీ డిజిటల్‌ను ప్రారంభించింది. ఇందులో ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలను అందించనుంది. రాబోయే ఐదేళ్లలో బిట్స్ పిలానీ డిజిటల్ 11 డిగ్రీ, 21 సర్టిఫికెట్ ప్రోగ్రాంలతో సహా 32 ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తుందని రామ్‌గోపాలరావు తెలిపారు. 2030 నాటికి భారతదేశంలోని టాప్ 5, ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 విద్యా సంస్థలలో ఒకటిగా ఉండాలని ఈ సంస్థ యోచిస్తోందని కుమార మంగళం బిర్లా అన్నారు. 2027 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.
ఈ చొరవను ప్రకటిస్తూ, బిట్స్ పిలాని ఛాన్సలర్, బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా కూడా సంస్థ యొక్క భౌతిక మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి దాని దీర్ఘకాలిక పరిశోధన మరియు అభివృద్ధి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అదనంగా రూ.1,219 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను వెల్లడించారు.