ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్ బాలయ్య తరపు లాయర్ మణీంద్రసింగ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఒక్కమాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది వార్నింగ్ ఇచ్చారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అంటూ ధర్మాసనం పేర్కొంది. సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలని బాలయ్య పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లను కూడా వాదిస్తారా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.