Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌

ఏపీలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు.

By అంజి  Published on  13 Dec 2024 6:45 AM IST
Andhrapradesh, Constable Candidates,APnews, Police Recruitment

Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌

ఏపీలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు స్టేజ్‌-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని రవిప్రకాష్ తెలిపారు. సందేహాలు ఉంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలన్నారు.

గత ప్రభుత్వం హయాంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం.. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌ చేబుతూ, నియామక ప్రక్రియ చేపట్టింది.

Next Story