యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య నారా భువనేశ్వరి యాక్టివ్ అయ్యారు

By Medi Samrat
Published on : 21 Oct 2023 8:15 PM IST

యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య నారా భువనేశ్వరి యాక్టివ్ అయ్యారు. తన భర్త అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన భర్తకు ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదని.. ఇవన్నీ అక్రమ కేసులని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక త్వరలోనే ఆమె ప్రజలలోకి వెళ్ళబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టేందుకు భువనేశ్వరి సిద్దమవుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభం కానుందని శనివారం నారా లోకేష్ తెలిపారు. యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టయ్యాక ఆవేదనతో మరణించినవారి కుటుంబాలను పరామర్శించనున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 25న యాత్ర మొదలవుతుందని, 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని చెప్పారు. తిరుమల నుంచి 24న నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్తారని లోకేష్ తెలిపారు.

Next Story