విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనుక దుర్గ అమ్మవారిని 'అఖండ' సినిమా బృందం దర్శించుకుంది. హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత రవీంద్రరెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీనివాసులు.. కనుక దుర్గ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గ గుడి అధికారులు బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అర్చకులు బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని, సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నామని చెప్పారు. అందరూ కుటుంబ సమేతంగా సినిమారి రావడంతో సంతోషన్నిస్తోందన్నారు.
నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారని.. ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అని బాలకృష్ణ పేర్కొన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా పని తలపెడితే విజయం తద్యం.. అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందన్నారు. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారని, టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం.. ఏదైతే అదని సినిమా విడుదల చేశామన్నారు. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశామన్నారు. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తామంటున్నారు చూద్దామని, న్యాయ నిర్ణేత దేవుడే దేవుడున్నాడని బాలయ్య అన్నారు.
మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తామని, సినిమా విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చిందన్నారు. అఖండ సినిమా విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చిందని.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా తాను గతంలో మాట్లాడానని.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తానంటోంది.. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి దాని బట్టి స్పందిస్తానని బాలకృష్ణ చెప్పారు.