ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన అవినాష్ రెడ్డి

ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని గత కొన్నిరోజులుగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  6 April 2024 3:06 PM IST
ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన అవినాష్ రెడ్డి

ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని గత కొన్నిరోజులుగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న ఓటమితో హత్యా రాజకీయాలకు స్వస్తి పలకొచ్చన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్‌ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి సీటును జగన్‌ వాడుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యలు చేసారు.

ఈ ఆరోపణలపై స్పందించిన అవినాష్ రెడ్డి.. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని, ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు. అలా చేయడమే మంచిదని అన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయని అన్నారు. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా అని అన్నారు అవినాష్ రెడ్డి.

Next Story