భూమా అఖిలప్రియపై విరుచుకుపడ్డ ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె

AV Subbareddy Daughter Fire On Bhuma Akhila Priya. టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త బార్గవ్‌రామ్‌ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  17 May 2023 6:45 PM IST
భూమా అఖిలప్రియపై విరుచుకుపడ్డ ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త బార్గవ్‌రామ్‌ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో మాజీమంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అడ్డుకోవాలని చూసిన ఆమె భర్త భార్గవ్‌రామ్‌, పీఏ మోహన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. ఆ సమయంలో భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారిందని అన్నారు. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది.

ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి అఖిలప్రియపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందన్నారు. సెల్ఫీ వీడియోలో అఖిలప్రియ చర్యలపై మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లకు పిల్లాడిని తీసుకురాకుండా సరిగ్గా అరెస్ట్‌ సమయంలో సంకలో పిల్లాడిని ఏస్కుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందన్నారు జస్వంతిరెడ్డి. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని.. ఆమె తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. అఖిలప్రియకు గనుక టికెట్‌ ఇస్తే తాను, తండ్రి ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ ఇప్పటి వరకూ ఏ ప్రెస్‌మీట్‌ పెట్టలేదని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు.


Next Story