వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం: వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on  9 Jun 2024 10:15 AM IST
Attack, YSR idols, YS Sharmila, APnews

వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం: వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని షర్మిల మండిపడ్డారు.

''తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి'' అని కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

Next Story