విశాఖలో ఉద్రిక్తత.. మంత్రుల కార్లపై దాడి
Attack on YSRCP leader Vehicles
By Medi SamratPublished on : 15 Oct 2022 12:34 PM

విశాఖపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ వద్ద మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. దీనిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తమవారికి గాయాలయ్యాయని జోగి రమేశ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు.
Next Story