కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ-తెలుగుదేశం వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారు. ఆఫీస్ అద్దాలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఒక కారుకు నిప్పు పెట్టారు. ఇటీవల ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబును ఎమ్మెల్యే వంశీ విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.