బ్రేకింగ్ : మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

Attack On Minister Perni Nani. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు.

By Medi Samrat  Published on  29 Nov 2020 12:28 PM IST
బ్రేకింగ్ : మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడికి య‌త్నించాడు. మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు.. దుండగుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. కాగ‌, దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ విష‌య‌మై నాని మాట్లాడుతూ.. ఈ రోజు త‌న త‌ల్లి పెద్ద‌క‌ర్మ‌ల ప‌నుల‌లో ఉండ‌గా.. ఇంటి గేటు వ‌ద్ద ఓ వ్య‌క్తి త‌ల‌వంచుకుని కాళ్ల మీద ప‌డుతున్న‌ట్లుగా వ‌చ్చి దాడికి పాల్ప‌డ‌బోయాడ‌ని.. చుట్టూ ఉన్న వాళ్లు అడ్డుకుని.. పోలీసుల‌కు అప్ప‌గించార‌ని.. ఈ దాడిలో నాకు ఏమి జ‌ర‌గ‌లేద‌ని.. క్షేమంగా ఉన్నాన‌ని మంత్రి తెలిపారు. మంత్రిపై జ‌రిగిన దాడిని సీపీఐ నేత నారాయ‌ణ ఖండించారు. ఘ‌ట‌న‌పై లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు.



Next Story