ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ న్యూస్‌ డిబేట్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆ ఛానెల్ లో డిబెట్ ప్రోగ్రామ్స్ ఎంతో హుందాగా సాగేవి.. కానీ మొదటి సారి రసాభాసాగా మారడమే కాదు బౌతిక దాడి కూడా జరిగింది. ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై అమ‌రావ‌తి జేఏసీ నేత, ద‌ళిత నాయ‌కుడు శ్రీ‌నివాస‌రావు చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న ప్రేక్ష‌కుల‌ను నివ్వెర‌ప‌రిచింది. సదరు ఛానల్ 'గ్రాఫిక్స్ పూర్తి చేద్దాం' శీర్షిక‌తో చ‌ర్చా కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.


రాజ‌ధాని అమ‌రావ‌తిలో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు నిర్మాణాలేవీ లేవ‌ని, అంతా గ్రాఫిక్స్‌లో చూపార‌ని అధికార వైసీపీ విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీన్ని వ్యంగ్య ధోర‌ణిలో ఆ ఛాన‌ల్‌ డిబేట్ చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అమరావతి గురించి చర్చ జరుగుతున్న సమయంలో.. 'టీడీపీ ఆఫీసులో పని చేసుకో.. టీడీపీ జెండా పట్టుకో..' అంటూ ఆవేశంతో ఊగిపోయారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావుపై.. దాంతో శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. ఈ క్రమంలో పలుమార్లు బీజేపీ నేత విష్ణుని హెచ్చరించారు.

కానీ ఆయన మాత్రం పదే పదే.. అదే ప్రస్తావన తీసుకు రావడంతో పూర్తిగా సహనం కోల్పోయిన శ్రీనివాసరావు చెప్పు చూపించడమే కాదు.. ఏకంగా దాడి కూడా చేశారు. దళిత నాయకుడు కావడంతో, ఈ వ్యవహారమిప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. 'అమరావతి పౌరుషం..' అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా ఈ దాడిని సమర్థిస్తున్నారు. మొత్తానికి ఈ చ‌ర్చ‌ను చూస్తున్న ప్రేక్ష‌కులు షాక్‌కు గుర‌య్యారు.


సామ్రాట్

Next Story