లొంగిపోయిన మావోయిస్టులకు పార్టీ ఇచ్చిన పోలీసులు

ASR police host party for surrendered Maoists. ఆదివారం నాడు లొంగిపోయిన, అరెస్టు చేసిన 140 మంది మావోయిస్టులకు అల్లూరి సీతారామరాజు

By అంజి  Published on  9 Jan 2023 5:11 AM GMT
లొంగిపోయిన మావోయిస్టులకు పార్టీ ఇచ్చిన పోలీసులు

ఆదివారం నాడు లొంగిపోయిన, అరెస్టు చేసిన 140 మంది మావోయిస్టులకు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు వారధి సమావేశాన్ని నిర్వహించారు. ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఏఎస్ఆర్ పోలీస్ చీఫ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరులో జరిగిన ఈ గెట్ టు గెదర్‌లో సుధీర్, మహిత, హరి, శ్రీకాంత్, అశోక్, మరికొంత మంది పాల్గొన్నారు. వీరంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన కొండ్రం, బలపం, గాలికొండ, మరికొన్ని ప్రాంతాలకు చెందినవారు. లొంగిపోయిన మావోయిస్టులతో ఇంటరాక్ట్‌ కావడం, వారి సంక్షేమం కోసం సాధ్యమైన అన్ని సహాయాలను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

లొంగిపోయిన మావోయిస్టులకు మ్యాజిక్ షోలు, మ్యూజికల్ షోలు ఏర్పాటు చేసిన పోలీసులు.. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఏఎస్‌ఆర్‌ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్.. వారికి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను బహుమతిగా ఇచ్చారు. గ్రామ యువకులకు వాలీబాల్‌, క్రికెట్‌ కిట్‌లను అందజేశారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరిస్తామని సతీష్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ప్రేరణ కార్యక్రమం కింద ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

డీబీటీ పథకాల గురించి కూడా వారికి తెలియజేశాడు. ఇతర శాఖల సమన్వయంతో వారికి ఆధార్ కార్డులు, అవసరమైన అన్ని సర్టిఫికేట్‌లను పొందడంలో సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో తమ గ్రామాల్లో అభివృద్ధి విప్లవానికి నాయకత్వం వహించాలని ఆయన పార్టీకి హాజరైన వారిని ప్రేరేపించారు. లొంగిపోయిన వారి పిల్లలు, తోబుట్టువులను పాఠశాలలు, ఇతర పోలీసు మద్దతు ఉన్న ఉద్యోగ కోర్సులలో చేర్చిన లొంగిపోయిన మావోయిస్టులను ఆయన అభినందించారు.

Next Story