జనవరి 26, 2025న ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 'ఏటికొప్పల బొమ్మలు' శకటం మూడవ బహుమతిని పొందింది. రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విజేతలను ప్రకటించింది. సర్వీసెస్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల ప్యానెల్‌లు విజేతలను ప్రకటించాయి.
ఉత్తరప్రదేశ్ కు చెందిన 'మహాకుంభ్ 2025 - స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్' మొదటి బహుమతిని పొందగా, త్రిపురకు చెందిన 'ఎటర్నల్ రెవరెన్స్: ది వర్షిప్ ఆఫ్ 14 డిటీస్ ఇన్ ఖర్చీ పూజ' రెండవ బహుమతిని గెలుచుకుంది. త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం, కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు బృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైనట్లు రక్షణశాఖ తెలిపింది.