మే 13న కార్మికులు, ఉద్యోగులకు.. వేతనంతో కూడిన సెలవు

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల పోలింగ్‌ మే 13వ తేదీన జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on  19 April 2024 6:30 AM IST
APPolls, paid holiday,  workers, employees, AndhraPradesh

మే 13న కార్మికులు, ఉద్యోగులకు.. వేతనంతో కూడిన సెలవు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ మే 13వ తేదీన జరగనుంది. దీంతో ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు ఇచ్చినందుకు జీతంలో ఎలాంటి కోత విధించకూడదని సూచించారు. అటు తెలంగాణలో ఇప్పటికే సెలవు ప్రకటించారు.

నాలుగో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను నిన్న విడుదల చేసింది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్​సభ స్థానాలకు మే 13న పోలింగ్​ నిర్వహించనున్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలతో సహా 96 స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. ఎస్టీ నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ, అరకు పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల కోసం మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

Next Story