జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ జి. రేఖా రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్ (5 ఖాళీలు), టెక్స్ టైల్ డిజైనర్స్ (5 ఖాళీలు) పోస్ట్ ల భర్తీకీ ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరటమైనదన్నారు. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్ కు దరఖాస్తుదారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ (D.H.T) లేదా టెక్స్ టైల్ టెక్నాలజీ నందు డిగ్రీ డిప్లొమా తో పాటు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, MS Word / Excel / పవర్ పాయింట్, రికార్డులు, ఖాతా పుస్తకాల నిర్వహణలో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. టెక్స్ టైల్ డిజైనర్ పోస్ట్ కు డిజైన్లు రూపొందించే నైపుణ్యం కలిగి నిఫ్ట్ ఎన్ఐడి లేదా ఏదైనా ప్రఖ్యాత సంస్థ / ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అలాగే కనీసం చేనేత విభాగంలో 2 సంవత్సరాలు టెక్స్ టైల్ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలన్నారు.
ఈ పోస్ట్ లకు అర్హత, అనుభవం, వయస్సు, నివాసం మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబడును అని తెలిపారు. దరఖాస్తుదారులు తమ ధృవపత్రాల కాపీలతో పాటు బయోడేటాను ప్రకటన వెలువడిన రోజు నుండి 21 రోజుల లోపు కమిషనర్, జౌళీ చేనేత శాఖ, 4వ అంతస్తు, కార్పొరేట్ బిల్డింగ్, ఐహెచ్సీ ఆటోనగర్, మంగళగిరి-522503, గుంటూరు జిల్లా నందు సమర్పించవలెనని కమిషనర్ రేఖా రాణి తెలిపారు. మరిన్ని వివరాలకు http://www.handlooms.nic.in ను సంప్రదించగలరు.